దీపావళి వేడుకల్లో చిరంజీవి క్రేజీ డ్యాన్స్... వీడియో ఇదిగో!

  • రామ్ చరణ్ నివాసంలో దీపావళి వేడుకలు
  • ర్యాప్ సింగర్ రాజకుమారి పాడుతుండగా చిరు స్టెప్పులు
  • ఎంజాయ్ చేసిన అతిథులు
దీపావళి సందర్భంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన నివాసంలో మెగా పార్టీ ఇచ్చాడు. ఈ వేడుకల్లో చిరంజీవి తదితర మెగా ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు, వెంకటేశ్, నాగార్జున, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, మంచు లక్ష్మి... ఇలా చాలామంది తారలు పాల్గొన్నారు. 

ఈ సంబరాల్లో ప్రముఖ ఇండియన్ ర్యాప్ గాయని రాజకుమారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కాగా, రాజకుమారి 'జవాన్' చిత్రంలోని టైటిల్ సాంగ్ ఆలపిస్తుండగా, మెగాస్టార్ వేసిన స్టెప్పులు దీపావళి పార్టీలో హైలైట్ గా నిలిచాయి. 

చిరంజీవి యంగ్ జనరేషన్ కు ఏమాత్రం తగ్గకుండా ఫుల్ జోష్ తో డ్యాన్స్ చేయడం అందరినీ ఆకట్టుకుంది. రాజకుమారితో కలిసి చిరు హుషారుగా డ్యాన్స్ చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Chiranjeevi
Dance
Deepavali
Ramcharan
Tollywood

More Telugu News